పల్లవి
[ఆమె]మేఘమాల మెరిసిందటే వాన చినుకు కురిసిందటే
నేలకు ఆనందం ఆ నింగికి ఆనందం ||2||
తారాలన్ని మురిసే వేళ నీటి పూలై విరిసే వేళ
వెన్నెల ఆనందం ఆ వన్నెలు ఆనందం ||2||
[అతడు] ఆనందం మర్మముమైతే అనురాగం మమ్మరమైతే
స్వర్గానికి నిచ్చెన వేస్తా ఈ జగతికి ప్రాణం పోస్తాం ||మేఘామాల...||
చరణం 1
అచ్చతెలుగు అంటానన్ని అచ్చం నా కోసం
వెండి మబ్బుల బంగారు తొడుగే మా కోసం
[అతడు] నవ్వు పువ్వులే ఈ జన్మంతా రువ్వులు మా కోసం
గుండె లోతుల తేనెల మడుగే మా కోసం
[ఆమె] మన్ను మిన్ను వన్నె చిన్నె అన్ని మా కోసం
ఉదయ సంధ్యా సాయం సంధ్యల వెలుగు మా కోసం
[అతడు] అమృతానికి తీపిని అద్దిన సొగసు మా కోసం
స్వర్గ సారను మించగా పుట్టినా భూమి మా కోసం ||మేఘామాల...||
చరణం 2
[ఆమె] చందమామకు వంతెన వేసే వెన్నెల మా కోసం
నీలి కన్నుల తెల్లని కలలే మాకోసం
చంద్రవంక వాగు వంక నిత్యం మా కోసం
కొండకోన చెట్టు చేమ మా కోసం
[ఆమె] ఏడు రంగుల ఇంద్రుని ధనస్సు పొంగు మా కోసం
ఈడు రేగిన ఇంతటి మనస్సు పొంగు మా కోసం
[అతడు] అదుర లేనిది ఏది లేదను వయస్సు మా కోసం
ఇన్ని ఇచ్చిన ఆ పై దేవుడు అసలు మా కోసం ||మేఘామాల||