పల్లవి
[అతడు]చిట పట చిట పట చిందే వాన
హరే చెట్టా పట్టా చెట్టా పట్టా వేసే వాన
[ఆమె] చెట్టే తేని పువ్వుల్లాగా రాలే వాన చేత వాలె వాన
[అతడు] వాన వాన వెండి వాన బంగారం లాగా దాచెయ్యనా
[ఆమె] వాన వాన రౌడివాన చేసే అల్లర్లు గుండె నిండా నింపుకోరా
[అతడు] దింత తకిట దింత తకిట దింత తకిట దింతతాన
నీతోరానా [అతడు] ఏదిమైనా
[ఆమె] దింత తకిట దింత తకిట దింత తకిట దింతతాన
నీతో రానా నీతో రానా
చరణం 1
[అతడు] వాన గుట్టు వణుకు పుట్టు చలిగా ఉన్నాగాని
చల్లనైనా ఐసు నేను తింటూఉంటా
[ఆమె] ఏకదాటి జల్లులోన ఎగిరి తడిసి అలిసి
తెచ్చుకున్న జలుబులోన తుమ్ము కూడా కమ్మునంటా
[అతడు] నల్లమబ్బులే నా ఆశకేమో అర్ధమంట నల్ల గొడుగులే నా ఆటకేమో అర్ధమంట
[ఆమె] ఆటలోనే చేస్తుంటే కొంటి చేష్టలే
మబ్బు అమ్మలాగా వేస్తుంది నీటి ముట్టికాయలే
[అతడు] చిలిపి దాడి చేస్తుంటే చిట్టి చినుకులే
నేల నాకు మల్లె నిలువెల్ల పులకరించి పోయెలే
[అతడు] వాన వాన నవ్వే వాన నన్నే నీలోన చూస్తూ ఉన్నా
[ఆమె] వాన వాన నచ్చే వాన ఆకాశాన్నంటే నిచ్చెనల్లే చేసుకోనా
దింత తకిట - - - నీతోరానా
చరణం 2
[ఆమె] వాన విల్లు రంగులంటి ఏడే ఉంటాయేమో
వేలవేల రంగులన్ని నాకే చేరు
[అతడు] వాన జల్లు వచ్చేనంటే ఉరుమే ఉరిమేనేమో
ఉరుము లేక చినుకులంటా కుర్రకళ్ళు ప్రేమ జల్లు
[ఆమె] చినుకు తాకితే చిర్రోచ్చినంటా కోనసీమ
నేను తాకితే ఫలించునంటా కొండసీమ
[అతడు] మేఘాన ఉన్నాయ్ నీటి విడుగు లేనా
దేహాన ఉందోయ్ పట్టు విడని పిడికిలే
[ఆమె] నాలోన ఉన్నాయ్ మెరుపు తీగలే
నారూపాన పూచాయి వెలుగు పూల తీగలే
[అతడు] వాన వాన ములిగే వాన నిండే నాతోటి పోలుస్తున్నా
[ఆమె] వాన వాన ముంచె వాన నాలో భావాలు మనస్సు విప్పి పంచుకోనా
దింత తకిట - - - నీతోరానా