ఇందురుడో చందురుడో

పల్లవి

[ఆమె] ఇందురుడో చందురుడో
మావహొల్ ఆంద్రాకే నచ్చాడమ్మా
యమా యమ్మా యమాయమ్మ హై యమ్మ
[అతడు] మేనకవో తారకవో భామడోలు సన్నాయి తెచ్చానమ్మా
[ఆమె] ముద్దులకు ఒద్దులకు ఉంది చలాకి మరుమల్లెలకు
వెన్నెలలకు మంచి గిరాకి
[అతడు] ఒంటి చలి తీరుటకే జంటగమారి ఇంక రేటపటికే శ్రీమతివే
నేటి కుమారి ఏది ఏమైనా ఓమైనా ప్రేమకలాపం
[ఆమె] సిగ్గు మొగ్గల్లో విచ్చుకునే పుష్పవిలాపం ||ఇందురుడో||

చరణం 1

[అతడు] చుక్కలలో చక్కదనం దాచిన దానా ఎలాగైనా లాగైనా ఎదో చేయనా దాచేయ్‌నా . . .
[ఆమె] కన్నులతో కన్నెర్రికం తీర్చినవాడా బలేవాడ నీమీదపడినీడ చిన్నోడా
[అతడు] నాతిచరామి ఇదే రాతిరి హామి
[ఆమె] చల్లనికామి సదానిన్ను స్మరామి
[అతడు] పక్కలుగ పరుచుకొనే పదహారేళ్ళు
[ఆమె] మక్కువగ లెక్కడిగే మంచంకోళ్ళు ||మేనక||

చరణం 2

[ఆమె] కోరికలా కోటలనే కట్టిన రాజా ఇదేపూజారేరాజా మహాతేజ మారాజా
[అతడు] పైటలలో పాటలెన్నో దాచినదానా శృతిచేయనా నీవీణ సునోజాణ తిల్లానా
[ఆమె] పట్టుపట్టాలి పడితే పక్కకు లాగి
[అతడు] కన్నెగులాబి బలే కౌగిలి బేబి
[ఆమె] హత్తుకునే జరుపుకునే కధ నూరేళ్లు
[అతడు] ఇద్దరమై కలుసుకున్న యద కుందేళ్ళు ||ఇందురుడా||