పల్లవి
చీకటితో వెలుగే చెప్పెను నేనున్నాని ఓటమితో గెలుపే చెప్పెను నేనున్నానని
నేనున్నానీ . . . నీకేంకాదని, నిన్నిటిరాతని మార్చేస్తాననీ . . .
చరణం 1
తగిలే రాళ్లని పునాది చేసి ఎదగాలని
తరిమే వాళ్లని హితులుగ తలచి ముందుకెళ్లాలనీ
కన్నుల నీటిని కలల సాగుకై వాడుకోవాలనీ
కాల్చేనిప్పుని ప్రమిదగ మలచి కాంతి పంచాలనీ
గుండెతో ధైర్యం చెప్పెను, చూపుతో మార్గం చెప్పెను
అడుగుతో గమ్యం చెప్పెను నేనున్నాననీ . . .
నేనున్నాననీ నీకేంకాదనీ, నిన్నటిరాతనీ మార్చేస్తాననీ . . .
చరణం 2
ఎవ్వరు లేని ఒంటరి జీవికి తోడు దొరికిందనీ
అందరువున్నా ఆప్తుడనువ్వై చేరువయ్యావనీ
జన్మకు ఎరుగని అనురాగాన్ని పంచుతున్నావనీ
శ్వాసతో శ్వాసే చెప్పెను మనసుతో మనసే చెప్పెను
ప్రశ్నతో బదులే చెప్పెను నేనున్నాననీ
నేనున్నానీ . . . నీకేంకాదనీ, నిన్నటిరాతనీ మార్చేస్తాననీ . . .
చీకటితో వెలుగే చెప్పెను నేనున్నానని
ఓటమితో గెలుపే చెప్పెను . . . నేనున్నానని
నేనున్నానని నీకేంకాదనీ . . . నిన్నటిరాతని మార్చేస్తాననీ . . .
చీకటితో వెలుగే చెప్పెను నేనున్నాని
విభాగములు:
- నాగార్జున,
- శ్రేయ,
* ఎమ్.ఎమ్. కీరవాణి,
* సునీత,
# యుగళ గీతాలు,
+ నేనున్నాను,
$ చ - ఝ