పల్లవి
ఎందుకనో నినుచూడగనే కవ్వించాలని ఉంటుంది ||2||
కవ్వించి నీవు కలహమాడితే నవ్వుకొనాలని ఉంటుంది ||ఎందుకనో||
ఎందుకనో నిను చూడగనే ఏదో ఇదిగా ఉంటుంది||2||
నీ పెదవులపై నవ్వు చిందితే మనసు చల్లగా ఉంటుంది ||ఎందుకనో||
చరణం 1
అడుగడుగున నీ రాజసమంతా ఒలికిస్తూ నువు కులుకుతు వుంటే||2||
నా కొంగున కట్టుకు నిను తిప్పాలని ||2||
ఏదో వేడుక పుడుతుంది,ఎందుకనో ||ఎందుకనో||
చరణం 2
అణువణువున నీ వంపుల సొంపులు నను మైకంలో ముంచుతు వుంటే||2||
నీలో ఐక్యం చెందాలంటూ ||2||
ఏదో తహతహ పుడితుంది ||ఎందుకనో||