కొత్త కొత్తగా ఉన్నదీ నాకేమి అయినది

పల్లవి

[ఆమె]కొత్త కొత్తగా ఉన్నదీ నాకేమి అయినది
ఆ అంతుపట్టని హాయిది ఈ మాయ ఏమిటి
కల ఇది ఎలా తెలిసేది మనసంతా మబ్బుల్లో తేలి తూలుతుంది ||కొత్త||

చరణం 1

నిన్న మొన్న చూడలేదు ఇంత గొప్ప లోకమే ఆహా ఏమందమే
చిన్న పెదవి మీద పెద్ద నవ్వు చేరుకున్నది ఆహ ఆనందమే
అందుకో మరి సిగ్గెక్కువైనది ఎండ మధ్యన బుగ్గ ఎర్రగైనది
అమ్మతోడు ఖచ్చితంగా ఏదో అయినది ||కొత్త||

చరణం 2

అర్ధరాత్రి నిద్రలోన అతని తీపి ఊసులే ఆహ ఏం చెప్పనే
ఎక్కడైనా ఎప్పుడైన అతని మీద ధ్యాసలే ఓహో ఏమున్నది
మాట కందని సంతోషమే ఇది మాయ ఏమిటో నా కర్ధమైనది
నన్ను నేడు చేరుకుంది మొదటి ప్రేమని ||కొత్త||