ఒకరి కొకరు నువ్వు నేనని ఒకరినొదిలి ఒకరం ఉండలేమని

పల్లవి

[అతడు]ఒకరి కొకరు నువ్వు నేనని ఒకరినొదిలి ఒకరం ఉండలేమని
[ఆమె] ఒకే ఒకరం అయిపోవాలని ఒకే ఆశ నాలో ఎందుకోగాని
[అతడు] ఇన్నాళ్ళు చూడలేనే వెంటొచ్చే నీడని నువ్వయినా
చెప్పలేదే ఈ నిజాన్ని
[ఆమె] ఈ రోజే తెలుసుకున్నా గుండెల్లో ప్రేమని నీతో నే సాగిపోని
నిండు నూరేళ్ళు జీవితాన్ని ||ఒకరి...||

చరణం 1

[అతడు] అలని శిలని అడిగా తోడేదని
[ఆమె] అది తెలిసి జతగా నిలిచా నీ నీడనై
[అతడు] నీకై పుట్టానని నువ్వయి ఉంటానని
నీతో చెప్పాలని ఒకటే ఆశ
[ఆమె] నాలో ఏనాటికి నువ్వే ఉంటావని సాక్ష్యం
అంటున్నది నాలో శ్వాస ||ఒకరి||

చరణం 2

[ఆమె] ఒడిలో ఒదిగి ఒకటైపోవాలని
[అతడు] సరిగమలో శృతిలా లయలా సాగాలని
[ఆమె] ఎన్నో కష్టాలని ఎంతో ఇష్టాలుగా మార్చే
మంత్రానివి మరి నువ్వేనా
[అతడు] మండే సూరీడుని నిండు జాబిల్లిలా మొత్తం
మార్చిందిలా నువ్వేకదా ||ఒకరి...||