ఎందుకయ్యా ఉంచినావు బందిఖానలో

పల్లవి

ఎందుకయ్యా ఉంచినావు బందిఖానలో
ఎందుకయ్యా ఉంచినావు బందిఖానలో
అయ్యా అయ్యా ఓ రామయ్యా ||ఎందుకయ్యా||

చరణం 1

రామదాసు కట్టించిన గుడిలో అంత మరమ్మతు జరుగుచుండగా
మా రామదాసు కట్టించిన గుడిలో
నీ పదకమలము నిరతము గొలుచుచు
నీ భక్తుడనై ఉండికూడా ఉలకక పలకక ఉండిననా
గుడ్లప్పగించి చూచుచుంటిననా ||ఎందుకయ్యా||

చరణం 2

నన్ను చెరలో వుంచి మేపుటకు ఎన్నో లక్షలు ఖర్చు కదా
గుళ్ళో దక్షిణ నాకయె ఖర్చు ప్రజలిచ్చు దక్షిణ అంతా ఖర్చు
ఎవడబ్బసొమ్ముది నీ తాత సొమ్మా
ఎవడబ్బసొమ్ముది నీ తాత సొమ్మా