ఎంతందంగా ఉన్నావే ఎవరే నువ్వూ

పల్లవి

ఎంతందంగా ఉన్నావే ఎవరే నువ్వూ
నాలో అలజడి రేపింది నీ చిరునవ్వూ ||2||
నా కన్నుల్లోన నీ రూపం నా కన్నా ఎంతో అపురూపం
కనిపించే చిన్నారి ఈ అనుభవమే నాకు తొలిసారి ||ఎంత||

చరణం 1

నిన్ను చూస్తే నిన్న లేని చలనం నాలోన నాలోన
కన్ను మూస్తే నిన్ను కలిసే కళలే ఓ లలనా
ఎందుకో నా గుండెలోన ఏదో హైరాన హైరాన
ఎంత మంది ఎదుట ఉన్నా ఒంటరి నవుతున్నా
ఈ అల్లరి నీదేనా నన్ను అల్లిన ధిల్లాన
అనుకున్నా మరి నాలోన నీ నమ్మని, కమ్మని కధ మొదలవునా
అందం ... ఎంతందంగా ఉన్నావే ఎవరే నువ్వునాలో ...
అయిపోయాను డ్రీమ్‌ బాయ్‌ ...
పడిపోయాను డ్రీమ్‌ బాయ్‌ ...

చరణం 2

మెరుపులాంటి సొగసులెన్నో నన్నే చూస్తున్న చూస్తున్నా
నేను మాత్రం నిన్ను చూస్తూ కలవర పడుతున్నా
ఊహలన్నీ వాస్తవాలై నీలా మారేనా మారేనా
ఊపిరేదో రూపమైతే అది నీవే మైనా
ఆ దైవం ఎదురైనా ఈ భావం నిలిపేనా
అనుకున్నా మరి నాలోనా నీ నమ్మని, కమ్మని కధ
మొదలవునా అందం ||ఎంత||