ఊహల పాటే మోహన రాగం ఊగిసలాడే ఊపిరి దీపం

పల్లవి

[అతడు]ఊహల పాటే మోహన రాగం ఊగిసలాడే ఊపిరి దీపం
ఓ కలలో సిరివెన్నెల కాసింది
ఈ కధలో కల కన్నులు మూసింది ||ఊహల...||

చరణం 1

ఏడేడు జన్మలకైనా నీతోడు వీడదులే ప్రాణాలు
హారతి పట్టి అంకితమిస్తాలే
నీదారి ఏదిశకైనా నీచేయి వదలనులే వేధించు
వేసవినైనా వెన్నెల చేస్తాలే
ఏరోజు కారోజు నూరేళ్ళు కావా కన్నీళ్ళు రానీకా ఉందామిలా
మళ్ళీ జన్మ ఉంటే నీకై పుట్టనా ||ఊహల...||

చరణం 2

ఎవరు తోడుగా నిలువనినాడు అందిన స్నేహమైనా
ఎదురై కనులే పిలిచే వేళ అందని దూరమా
యెదలో రగిలే సొదలను దాచే బంధమే న్యాయమైనా
తనతో మెలిగే కలలను చూసి కోరికే నేరమా
అనురాగమే నాలో గతం ఆరాధనేలే
నా స్వాగతం ||ఊహల||