కర్నూలు ఎక్కడ కాకినాడ ఎక్కడ

పల్లవి

కర్నూలు ఎక్కడ కాకినాడ ఎక్కడ
ఏలూరు సాలూరు ఆలూరు ఎక్కడ వరంగల్లు ఎక్కడ
వాడవాడల నుండి వాలాము ఇక్కడ
లక్కా బంగారంలా అతుక్కుపోయామురా బ్రదర్

చరణం 1

భలే భలే మంచి రోజులులే మళ్ళీ మళ్ళీ ఇక రావులే||2||
స్టూడెంట్ లైఫే సౌఖ్యములే చీకుచింతలు దూరములే
||భలే భలే||

చరణం 2

పంపు నీళ్ళు బందయితే స్నానానికి నోచుకోము
గుయ్‌మని దోమలు దాడిచేస్తే శివరాత్రి జాగరణ చేస్తాము
ఉప్పు కారం లేని హోటల్ సాపాటుతో చప్పబడిపోయామురా బ్రదర్
ఎన్ని కష్టాలురా నా తండ్రీ భయపడకురా పుత్రా
కష్టాలను దిగమింగేద్దాం కలకల నవ్వుతూ గడిపేస్తాం
||భలే భలే||

చరణం 3

ఇంటికి పోతే పెళ్ళిపెళ్ళని వెంటపడతారు పెద్దలు
పెళ్ళి చేసుకుంటే మేమూ మేమని పుట్టుకొస్తారు పిల్లలు
ఈ జంజాటంలో విద్యనాశాయ సర్వం నాశాయ
నమో నమోరా బ్రదర్ సహనం సహనం ఉపాయం ఉంది నాయనా
పెళ్ళికి బకాయి పెట్టేస్తాం బాధ్యతలన్నీ నెట్టేస్తాం
||భలే భలే||

చరణం 4

బాధ్యతలెన్నడూ మరచిపోరాదు ప్రగతిమార్గము నెపుడు వదలిపోరాదు
క్రమశిక్షణ పాటించి కదలి రావాలిరా
ఆదర్శంగా నడవాలి అందరు భేషని పొగడాలి||2||
||భలే భలే||