కలకానిది విలువైనది
బ్రతుకు కన్నీటి ధారలలోనే బలిచేయకు ||2||
చరణం 1
గాలివీచి పువ్వులతీగ నేలవాలిపోగా ||2||
జాలివీడి అటులే దాని వదిలివైతువా ఓ....
చేరదీసి నీరుపోసి చిగురించనీయవా ||కలకానిది||
చరణం 2
అలముకున్న చీకటిలోనే అలమటించనేలా ||2||
కలతలకే లొంగిపోయి కలవరించనేల ఓ....
సాహసమున జ్యోతిని చేకొని సాగిపో ||కలకానిది||
చరణం 3
అగాధమౌ జలనిధిలోనా ఆణిముత్యమున్నటులే
శోకాల మరుగున దాగి సుఖమున్నదిలే ||2||
ఏదీ తనంత తానై నీ దరికిరాదు
శోధించి సాధించాలి... అదియే ధీరగుణం ||కలకానిది||