పల్లవి
చల్లని వెన్నెల సోనలు తెల్లని మల్లెల మాలలు
మా పాపాయి బోసినవ్వులే మంచి ముత్యముల వానలు
||చల్లని||
చరణం 1
పడికిలి మూసిన చేతులు లేత గులాబీ రేకులు||2||
చెంపకు చారెడు సోగకన్నులె సంపదలీనెడు జ్యోతులు
మా పాపాయి బోసినవ్వులే మంచి ముత్యముల వానలు
||చల్లని||
చరణం 2
ఇంటను వెలసిన దైవము కంటను మెరిసిన దీపము
మా హృదయాలకు హాయి నొసంగే పాపాయే ప్రాణము
మా పాపాయి నవ్వుపువ్వులే మంచి ముత్యముల వానలు
||చల్లని||
చరణం 3
నోచిన నోముల పంటగా అందరి కళ్ళకు విందుగా||2||
పేరుప్రతిష్టలే నీ పెన్నిధిగా నూరేళ్ళాయువు పొందుమా
మా పాపాయి నవ్వుపువ్వులే మంచి ముత్యముల వానలు
||చల్లని||