పల్లవి
హాయి హాయిగా జాబిల్లి తొలిరేయి వెండి దారాలల్లి
మందుజల్లి నవ్వసాగే ఎందుకో మత్తుమందు జల్లి
నవ్వసాగే ఎందుకో
||హాయిగా||
చరణం 1
తళతళ మెరిసిన తారక చెలి వెలుగుల వెన్నెల దారుల||2||
కోరి పిలిచెను తన దరి చేరగ మది తలచెను తీయనికోరిక||2||
||హాయిగా||
చరణం 2
మిలమిల వెలిగే నీటిలో చెలి కలువల రాణిచూపులో||2||
సుమదళములు పూచిన తోటలో తొలివలపుల తేనెలు రాలెను
||హాయిగా||
చరణం 3
విరిసిన హృదయమే వీణగా మధురసములు కసరిన వేళలా||2||
తొలి పరువములొలికెడు సోయగం కని పరవశమందెను మానసం
||హాయిగా||