అల్లో నేరేడ కళ్ళదాన ప్రేమవల్లో

పల్లవి

అల్లో నేరేడ కళ్ళదాన ప్రేమవల్లో పడ్డానే పిల్లదానా
హల్లో వర్ణాల పూలవానా నిన్ను జళ్ళో చుట్టేసి దాచుకోనా
నమ్మేదెలా? మైనా ఇంత ప్రేమ నామీదైనా!
కల్లో లేదేనయనా!అల్లుకుంటూ ఒళ్ళోలేనా
||అల్లో||

చరణం 1

దాయిదాయి అనగానే చేతికందేనా చంద్రవదనా
కుంచై నువ్వే సోకగానే పంచప్రాణాలు పొందినానా
బొమ్మో గుమ్మో తేలక మారిపోయా నేనే బొమ్మగా
ఏదో చిత్రం చేయగా చేరువయ్యాం నేనే చెలిగా
రెప్పమూసినా తప్పుకోనని కంటి పాప ఇంటిలోన ఏరికోరి చేరుకున్నదీపమా
||అల్లో||

చరణం 2

అన్నెం పుణ్యం లేనివాడని అనుకున్నాను ఇన్నినాళ్ళూ
అభం శుభం లేనివాడిని అల్లుకున్నాయి కన్నెకళ్ళు
మైకం పెంచే మాయతో మూగసైగే చేసేదాహమా
మౌనం మీటే నీళ్ళతో తేని రాగం నేర్పే స్నేహమా
ఒంటరైన నా గుండె గూటిలో సంకురాత్రి పండగంటి సందడల్లే చేరుకున్నా రూపమా
||అల్లో||