పల్లవి
[అతడు] లంగావోణి నేటితో రద్దైపోని సింగారాన్ని చీరతో సిద్దం కాని
నిన్నలా తనలా తుళ్ళకే అమ్మాడి చిందుతే ఆపగా ముళ్ళు వెయ్యని
[ఆమె] సర్లేగాని పక్కగా పెళ్ళైపోని అల్లర్లన్ని జంటలో చెల్లైపోని
లగ్నమే పట్టబై పట్టుకో ప్రాయాన్ని సొంతమై అందమే అప్పగించని... ||లంగావోణి||
చరణం 1
[ఆమె] చూడు మరీ దారుణం ఈడు నెలా ఆపడం వెంటపడే శ
త్రువయ్యే సొంత వయ్యారం
[అతడు] ఏ ఒంటరిగా సోయగం ఎందుకలా మోయడం కళ్ళెదురే
ఉంది కదా ఇంత సహయం
[ఆమె] పుస్తే కట్టెయ్ పుచ్చుకో కన్యాదానం
[అతడు] సిస్తే కట్టి తీర్చుకో తియ్యని రుణం... ||లంగావోణి||
చరణం 2
[అతడు] సోకు మరి సున్నితం దాన్ని ఎలా సాకటం లేత నడుం
పాలదుగా గాలి ధుమారం
[ఆమె] కస్సుమనే లక్షణం చూపనిదే తక్షణం జాలిపడే లాలనతో
రంగ దుభారం
[అతడు] ఇట్టే వచ్చి అల్లుకో ఇచ్చే దిచ్చి
[ఆమె] ఆర్చి తీర్చి ఆదుకో గిచ్చి గిచ్చి... ||లంగావోణి||