మెల్లగా కరగని

పల్లవి

[అతడు] మెల్లగా కరగని రెండు మనస్సుల దూరం
[ఆమె] చల్లగా తెరవని కొంటె తలుపులు ద్వారం
[అతడు] వలపు వాన దారాలే పంపుతున్నది ఆకాశం
[ఆమె] చినుకు పూల హరాలే అల్లుతున్నది మనకోసం
[అతడు] తడిపి తడిప ఇ తనతో నడిపి హరివిల్లులు వంతెన వేసిన శుభవేళ
[కోరస్] ఈ వర్షం సాక్షిగా తెలపని నువ్వు నాకే సొంతం
ఈ వర్షం సాక్షిగా కలపని బంధం ||మెల్లగా||

చరణం 1

[అతడు] నీ మెలికలలోన ఆ మెరుపులు చూస్తున్న ఈ తొలకరిలో
తళ తళ నాట్యం ఇదేనా
[ఆమె] ఆ ఉరుములలోన నీ గెలుపులు వింటున్నా ఈ
చిటపటలో చిటికెల స్థానం నీదేనా
[అతడు] నీ మతి చెడై దాహమై అనుసరించి వస్తున్నా
[ఆమె] జతపడే స్నేహమై అనునయించనా
[అతడు] చలిపిడుగుల సడి విని జడిసిన విడియను తడబడి నిన్ను విడగా
[కోరస్] ఈ వర్షం సాక్షిగా తెలపని నువ్వు నాకే సొంతం
ఈ వర్షం సాక్షిగా కలపని బంధం ||మెల్లగా||

చరణం 2

[ఆమె] ఏ తెరమరుగైనా ఈ చొరవదు ఆపేదా నా పరువముని
కనులకు కానుక ఇస్తున్నా
[అతడు] ఏ చిరు చినుకైనా నీ సిరులను చూపేనా ఆ వరుణునికే
రుణపడిపోనా ఈ పైనా
[ఆమె] మొరపడి వయస్సునే నిలుపలేను ఇకపైనా
[అతడు] విరుడనే మెత్తని ముడులు వేయనా
[ఆమె] మన కలయిక చెదరని చెలిమికి రుజువులు చెరిపెను చెదిరేనా
[అతడు] ఈ వర్షం సాక్షిగా తెలపని నువ్వు నాకే సొంతం