పల్లవి
[ఆమె] ఝూలే ఝూలే ఝుం ఝుం ఝూలే
గుండెల్లో శంఖాలుదే సుడిగాలి
ఝూలే ఝూలే ఝుం ఝుం ఝూలే
పొంగేలి గంగ నాపే శివుడేలే
వాడంటి వాడే మొజ్జగాడంటే వాడే ఆ రొమ్ము చూడే
ఆ ధమ్ము చూడే నా జన్మ చెమ్మలారే
చరణం 1
[అతడు] ఝూలే ఝూలే ఝుం ఝుం ఝూలే
అందెల్లో జలపాతాలే తుళ్ళేనే
ఝూలే ఝూలే ఝుం ఝుం ఝూలే
శివశక్తి చిందాడిందే జవరాలే
[ఆమె] సూదట్టి కెళ్ళి అది తేనెటీగ ముళ్ళై... ||2|| చుక్కల్లే పెంచి చూపులే
[అతడు] పువ్వంటి ఒళ్ళే పచ్చిపాలజల్లే ఎక్కిళ్ళు పెంచే సోకులే
[ఆమె] నీ కౌగిలింత నా కోట చేసుకుంటా
[అతడు] చిరుచినుకంత చింతా నిన్ను చేరకుండా కన్నుల్లో
దాచుకుంటా... ||ఝూలే||
చరణం 2
[అతడు] చిన్నారి హంస ఇష్టమైన హింస... ||2|| రేపావే నాలో లాలసా
[ఆమె] కొండంత ఆశ నీ కూతే వేసా నీ సొంత మేలి బానిసా
[అతడు] నీ తాపాన్ని చూశా హరె పాపం అనేసా
[ఆమె] అబ్బ నీతో బరోసా వెన్నెల్లో శ్వాసా నీ పేరు రాసేసా