మెరుపై సాగర ఆ గెలుపే నీదిరా

పల్లవి

[అతడు] మెరుపై సాగర ఆ గెలుపే నీదిరా నీరెపటి లక్ష్యం మరువకు సోదరా....
నిప్పులు చిందిన ఏ పిడుగులు ఆపినా వెనకడుగే వేయక ముందుకు సాగరా
నలుదిక్కులు నవ్వుతు ఉన్న నలు పెక్కని సూర్యుడు నువ్వై
ఆ చుక్కలనే ఇలదించే నీ శక్తిని యుక్తిగ చూపై
నటరాజై నువురాజై నీ గెలుపే నీలో ||మెరుపై సాగర||

చరణం 1

[అతడు] అమ్మ మాటకోసం నువు ఆయుధంగ మారి కొండలె ఢీకొట్టర
అది ఎంత కష్టమైనా
ఆశయాల పీఠం నువ్వు అందుకున్ననాడు, నిండుగా మురిసేనుర
మీ అమ్మ ఎక్కడున్నా
చేయూతె ఇస్తుంటే ఓ స్నేహబంధం చరితల్లె మారాలి నువెళ్ళు మార్గం
నీ ప్రతిభే చూపించే ఆరోజు కోసం ప్రతి అణువు కావాలి నీ వెనుక సైన్యం
లేర అడుగైర ఆశిఖరం చేర ||మెరుపై సాగర||

చరణం 2

[అతడు] కిందపడుతు ఉన్న పైపైకి పరుగుతీసి అలలతో పోటీపడి చేరాలి కలల కడలి
పందెమేది అయిన నీ పట్టుదలను చూసి ఒంటరై ఒణకాలిర ఆ ఓటమైన హడలి
అందరికి చేతుల్లో ఉంటుంది గీత నీకేమో కాళ్ళల్లో ఆ బ్రహ్మరాత
నీ కాళ్ళు మడుగులతో కాలాన్ని ఆపి లోకాలే పొగిడేలా చూపించు ఘనత
లేర చిందైర విజయం నీదేర ||మెరుపై సాగర||