సాకీ
[అతడు] సినుకు రవ్వలో సినుకు రవ్వలో చిన్నదాని సంబరాల చిలిపి
నవ్వులో... ||కో||
పంచవన్నె చిలకలల్లె వచ్చి రాని దునుకలల్లె వయస్సు మీద
వాలుతున్న వాన గువ్వలో... ||కో||
పల్లవి
[ఆమె] ఇన్నాళ్ళ గుర్తొచ్చానా వానా ఎన్నాళ్ళని దాక్కొంటావే పైన
పైన చుట్టంలా వస్తావే చూసెళ్ళిపోతావే
అచ్చంగా నాతోనే నిత్యం ఉంటానంటే చెయ్యార చేర దీసుకోనా
నువ్వొస్తానంటే నేనొద్దంటానా... ||2|| తకిటిత తకిటిత తా ||ఇన్నాళ్ళ||
చరణం 1
[ఆమె] మత్తులొలికే ముక్కుపుడక్కయి ఉండిపోవే ముత్యపు చినుకా
చెవులకు సత్తా జుంకలాగా చేరుకోవే చిలుగుల చుక్కా
చేతికి రవ్వల గాజుల్లాగా కాలికి మువ్వల పట్టీలాగా
మెళ్ళో పచ్చని పతకంలాగా వదలకు నిగనిగ నగలను తొడిగేలా
నువ్వొస్తానంటే నేనొద్దంటానా... ||2|| తకిటిత తకిటిత తా... ||ఇన్నాళ్ళ||
చరణం 2
[ఆమె] చిన్ననాటి తాళినైనా నిన్ను నాలో దాచుకోనా
వెన్నెలేటి సూర్యుడల్లా నన్ను నీలో పోల్చుకోనా
పొదుగులు పాడే కిల కిలలోన పదములు ఆడే కథకళిలోన
కనులను తడిపే కలతలలోన నా అణువణువు తులకన పెంచేలా
నువ్వొస్తానంటే నేనొద్దంటానా... ||2|| తకిటిత తకిటిత తా... ||ఇన్నాళ్ళ||