సన్నజాజి పాడక మంచె కాడ పాడక
చల్లగాలి పాడక
మాటవినకుందీ ఎందుకే... ||2||
మనసులో ప్రేమే ఉంది మరువని మాటే ఉంది
మాయని ఊసే పొంగి పాటై రావే... ||సన్నజాజి||
చరణం
కొండమల్లి పువ్వులన్నీ గుండెల్లో నీ నవ్వులన్నీ
దండే కట్టి దాచుకున్నా నీ కొరకే...
పండు వెన్నెలంటి ఈడు ఎండల్లోన చిన్నబోతే
పండించాగా చేరుకున్నా నీ దరికే
అండా దండా నీవేనని పండగంతా నాదేనని
ఉండి ఉండి ఊగింది నా మనసే...
కొండాపల్లి బొమ్మా
ఇంకా పండు చెండు దోచెయ్యనా
గుండె పంచే వేళైనది రావే...
దిండే పంచే వేళైనది రా... వే... ||సన్నజాజి||
అడిగితే సిగ్గేసింది సిగ్గులో మొగ్గేసింది
మొగ్గలా బుగ్గేకంది పో... యే...
మాట వినకుంది ఎందుకే...