పల్లవి
నువ్వే నువ్వే అంటూ నాప్రాణం
పదే పదే పిలిచే ఈ గానం
ప్రతీచోటు నీకోసం వెతుకుతుండగా
కన్నుల్లోన నీరూపం వెలుగుతుండగా
మనస్సంతా మల్లెల జలపాతం ||నువ్వే||
చరణం 1
[అతడు] కనులకు గుచ్చే తీయని భావం
ప్రేమోఏమో ఎలా చెప్పను
[ఆమె] తహతహ పెంచే తుంటరి దాహం
తప్పో ఒప్పో ఏం చేయడం
[అతడు] ఊహల్లో ఉయ్యాలూపే సంతోషం రేగేలా
[ఆమె] ఊపిరిలో రాగం తీసేసంగీతం సాగేలా
[అతడు] అలవై పిలిచే ప్రణయసుప్రభాతం ||నువ్వే||
చరణం 2
[ఆమె] ఎవరెవరంటూ గెలిచిన ప్రాణం
నిన్నె చూసితలొంచే క్షణం
[అతడు] మిసమిసమంటూ నీనయగారం
హారంవేసివరించే క్షణం
[ఆమె] స్నేహాల జంటే అల్లేసి కౌగిల్లో
[అతడు] పపారాశి పాదాలే పారాడే గుండెల్లో
[ఆమె] నడకే మరచి శిలయ్యింది కాలం ||నువ్వే||