ఇంటిలోకి వెల్‌కమంటూ

పల్లవి

[ఆమె] ఇంటిలోకి వెల్‌కమంటూ గేటు తీసినాడు మాస్టరు
టేస్టు కాస్త చూడమంటూ బూస్టు కలిపినాడు మాస్టారు
అలా అలా హఠాత్తుగా అటు ఇటు కరెంటు పోగా
నెక్ట్స్ సీన్‌ ఏమి జరిగింది
[ఆమె] జెస్ట్ నాకు సిగ్గేస్తోంది ||నెక్ట్స్|| ||ఇంటి||

చరణం 1

[అతడు] శిష్యురాలా చారుశీలా శీఘ్రమేవా రోమాన్సు నీకు ప్రాప్తిరస్తు
[ఆమె] అక్షరాలా దీక్షబూని లవ్‌లోని లెసన్సు నేను ఆలకిస్తూ
[అతడు] అందంతో పరీక్ష ఇప్పుడు
[ఆమె] అర్ధాంగి ప్రమోషనెప్పుడు
[అతడు] ఫలితం రానున్నది
[ఆమె] పరువం ఔనన్నది ||ఇంటి||

చరణం 2

[ఆమె] ఫోర్టికోలో లైబ్రేరీలో కారిడర్‌లో భరించలేని తాపమాయే
[ఆమె] పుస్తకాలో డిక్షనరీలో బ్లాక్‌బోర్డ్‌లో లిఖించలేని ఆశలాయే
[ఆమె] వల్లించేయ్‌ వయస్సు వాచకం
[అతడు] చెల్లించేయ్‌ వయ్యారి వేతనం
[ఆమె] గురువా లేటెందుకు
[అతడు] లఘువై రా ముందుకు ||ఇంటి||