పల్లవి
[అతడు] తిలోత్తమా ప్రియా వయ్యారమా
[ఆమె] ప్రభాతమా సుఖ వసంతమా
[అతడు] నే మోయలేనంటూ హృదయాన్ని ఎరువిచ్చా
[ఆమె] నేనున్నా లెమ్మంటూ అది నాలో దాచేసా
[అతడు] ఏదారిలో సాగుతున్నా ఎద నీవైపుకే లాగుతోంది
[ఆమె] ఏవేళలో ఎప్పుడైనా మది నీ వూహలో వూగుతోంది ||తిలో||
చరణం 1
[అతడు] పెదవే ఓ మధుర కవిత చదివే
[ఆమె] అడుగే నాగడప నొదిలి కదిలే
[అతడు] ఇన్నాళ్లు లేని ఈ కొత్తబాణి
ఇవ్వాళ్లే మనకెవరు నేర్పారమ్మ
[ఆమె] ఈ మాయ చేసింది ప్రేమే
[అతడు] ప్రియ ప్రేమంటే ఒకటైన మనమే ||తిలో||
చరణం 2
[అతడు] కలలే నా ఎదుట నిలిచే నిజమై
[ఆమె] వలపే నా ఒడికి దొరికే వరమై
[అతడు] ఏ రాహువైనా ఆషాఢమైనా ఈ బాహుబంధాన్ని విడతీయునా
[ఆమె] నీ మాటలే వేదమంత్రం
[అతడు] చెలి నువ్వన్నదే నా ప్రపంచం ||తిలో||