కళకళలు కిలకిలలు కొత్తగ చేరెను

పల్లవి

కళకళలు కిలకిలలు కొత్తగ చేరెను మా ఎదగూటికి
వెలుతురులు వెన్నెలలు ఎదురుగా నిలిచెను మా కన్నులకి
రాముడికి జానకికి పెళ్లి కుదిరినది
ఈ సందడికి విందులకి ఇల్లు మురిసినది ||కళ||

చరణం 1

నమ్మలేని లోకంనుంచి మహాలక్ష్మి లాగా
అమ్మలేని మా ఇంట్లోకి వదినమ్మ రాక
ఎన్నడైన తన వెనకాలే ఉంటాను కనక
అన్నగారు తననేమన్న ఊరుకోను ఇంక
నా చిన్ని అల్లరులన్ని భరించాలి అంతా ఓర్పుగా ||కళ||

చరణం 2

మెట్టినింటి దీపం నీతో వెలగాలి మళ్లీ
కూతురంటి రూపం నీదే నాచిట్టితల్లి
ఆశలన్ని అక్షింతలుగా జరగాలి పెళ్లి
అందమైన జంటను చూసి మురివాలి తాళి
విడిది నేను ఇస్తానంటూ జపించాలి నింగిన జాబిలి ||కళ||