హంగామా హంగామా ఆనందమందామయా

పల్లవి

[అతడు] హంగామా హంగామా ఆనందమందామయా
[ఆమె] రంగేళి ఊహల్లో రోజంతా ఉందామయా
[అతడు] ఏడేడు లోకాల అందాలు చూద్దామయా
[ఆమె] ఆరారు కాలాలు నీతోటి సాగాలయా
[అతడు] దారి చూపిస్తా పిల్లా హాయి చూపిస్తా
ఆదితాళంలో నీతో ఆటలాడిస్తా
[ఆమె] సోకు రాసిస్తా నీకు సోయగాలిస్తా సందెవేళల్లో
ముద్దు సంతకాలిస్తా ||హంగా||

చరణం 1

[ఆమె] హవ్వాయ్యో అంది ఈడు వేడి తాపం
[అతడు] వారెవ్వా చూడు ప్రేమ ఇంద్రజాలం
[ఆమె] అంటూ అడుగుతుంది మోహం హువ్వార్యూ
[అతడు] లోలో ఉంటుంటే ఎరగనంత పాపం
[ఆమె] గాలి తాకిందో రమ్మో కోక జారింతో,
గిల్లి పోయిందో రమ్మో కందిపోయింది
[అతడు] కన్ను గీటిందీ పిల్ల సైగ జేసిందీ,
షోకు చూపిందీ నాకు కాకరేపిందీ ||హంగా||

చరణం 2

[అతడు] లవ్లీగా ఉందీ వేడి ముద్దులాడి
[ఆమె] రోజులా లేదు జారుతుంది పైట
[అతడు] లాలీజో అంటూ పాడకమ్మ పాట
[ఆమె] లేలోజీ అన్న అయ్యగారు లేటా
[అతడు] స్పీడుమీదుందీ బండి వేడిమీదుంది
ఆగమంటున్నా అయ్యో ఆగనంటుంది
[ఆమె] చెంచురామయ్యో చెయ్యి అందుకోవయ్యో,
ఆగిపోకయ్యో నాతో చిందులాడయ్యో ||హంగా||