దమ్మెంతో చూపించరో దెబ్బకీ

పల్లవి

దమ్మెంతో చూపించరో దెబ్బకీ, పాతాళం బద్దలవ్వాలా
[ఆమె] చక్కంగా చిందెయ్యరో చిన్నది సిరిమల్లె విచ్చుకోవాలా
[అతడు] పుడమి పిల్లా ఒకటేనంటా, మొదటే బెడదై కొంచెం తంటా
[ఆమె] బెరకు గిరుకు అసలొద్దంటా, చెమటోడిస్తే ఫలముందంటా
[అతడు] ఆడే కాలు ఆడాల, పాడే నోరు పాడాల,
సాగే వాగు సాగాల ఊగే వయస్సు ఊగాల
[ఆమె] పెట్టు కూత పెట్టాల పుంజు మేత పెట్టాల
అగ్గిరాజు కోవాల సెగ భగ్గుమనాల ||దమ్మె||

చరణం 1

[అతడు] బుగ్గా పైన ఎర్రారంగు ఎవరుద్వారా హే
[ఆమె] ఈ నెలకీ ఆపూలకీ ఎవరద్దారో వారేనయ్యే
[అతడు] ఆ పైట బింకం ఎందుకంటా ఆరైక పొంకం దేనికంటా
[ఆమె] వరసైన వాడు వడిచేరితే వెర్రెక్కి పోయేటందుకంట
[అతడు] ఆశ ఆరుపుంజాలు మోజు మూడు కుంచాలు వేసేయ్
పట్టి మంచాలు, పంచెయ్ సోకు రసాలు
లాయి లాయి లలలా - 3, లాయి లాయి లలాలోయ్ ||దమ్మె||

చరణం 2

[ఆమె] ఆ చూపులో చురకత్తులు, చంపేస్తుంటే ఏం చెయ్యాలా
[అతడు] ముప్పూటలా ముద్దూ మందూ అప్పానంగా అందించాల
[ఆమె] కౌగిళ్ళ కట్నం అందించేనా, పిల్లాడి కొకకీ సెలవిచ్చేనా
[అతడు] పరువాలపల్లకీ ఎక్కించేయ్‌నా, పగటే వేళ చుక్కలే చూపించేయ్‌నా
[ఆమె] నక్కే చోట నక్కాల, నొక్కే చోట నొక్కాల
నువ్వు రెచ్చిపోవాల నేను వచ్చి పోవాల ||దమ్మె||