వారిజ బవురాణి వాణి

పల్లవి

వారిజ బవురాణి వాణి
వరవీణాంచిత మృదుపాణీ ||2||
హంసవాహనా అంబుజ నయనా ఆ . . .||2||
అందుకొనుము ఈ గీతాంజలి ||వారిజ||

చరణం

శ్వాసకేతివి శ్రీ పీఠముగా
కొలువు చేయుమని కోరితిమమ్మా
సరిగమ స్వరములే సరిగమ పదనిస ||2||
సుమ మాలికగా స్వేదించితిమి చేకొనుమమ్మా
సామ కంకితపు సాకారమీవే ||2||
సాగు దయాలసన్నిధినీవే ||వారిజ||