ఆ . . . ఓ మామా

పల్లవి

[ఆమె] ఆ . . . ఓ మామా
[అతడు] ఏంపిల్లా
[ఆమె] పొయిమీద పులుసెట్టి పొయికింద పిడకెట్టి ఓ మామా ||2||
పులుసు మరిగేదాకా సరసమాడి పోయానే
లబ్జనక లబ్జనక లబోలబో లబ్జనక
[ఆమె] బావొస్తే మావొస్తే నమస్తే
[అతడు] అహ వచ్చేస్తా
[ఆమె] ఆహొ
[అతడు] మెచ్చేస్తా
అల్లేస్తా గిల్లేసా
[ఆమె] ఆకిస్తా వక్కిస్తా తోడుంటే
[అతడు] అహ తోడొస్తా
[ఆమె] హే
[అతడు] గీటిస్తా పెళ్ళాన్నే వగ్గేస్తా
[ఆమె] చింతామణి చిట్కాల్ని చూపిస్తారావయ్యా
[అతడు] పాలపుంతలో తానాలు
[ఆమె] అహ సోకుసంతలో సహనాలు
[ఆమె] దూల్ జగజగ గోలు గొలంబస్ ||2|| బావొస్తే||

చరణం 1

జింగిలి బింగిలి లైలా ఓ జింగిలి బింగిలి లైలా
ఓ జింగిలి బింగిలి జింగిలి బింగిలి లైలా లైలా ||జింగిలి||
[ఆమె] ఓ మామా
[అతడు] ఏంపిల్లా
[ఆమె] ఆ వీధి కుర్రోడు ఈ వీధి కొచ్చాడు ఓ మామా ||2||
జారుపైట లాగబోయి జావకారి పోయాడు ||లబ్జనక||
అందంలో ఐశ్వర్య దాయిని
[అతడు] అహ ఏంచూపు ఏంషేపు ఏంకైపు నీచూపు
[ఆమె] కులుకుల్లో తళుకుల్లో సిల్కుని
[అతడు] హ సాగిస్తా షోకుల్లో షేకిస్తా రా బుల్లో
[ఆమె] కాలేజి కుర్రోల్ళే డామేజీ లేనోళ్ళే
[అతడు] లవ్వాటలో లాభాలు
[ఆమె] నువ్వాటలో పోబాబూ ||దూల్|| ||బావొస్తే||

చరణం 2

ఆవో ఆవో చుమ్మాదేవో ||2|| ||జింగిలి||
[ఆమె] ఓ మామా
[అతడు] ఏంపిల్లా
[ఆమె] ఆంధ్రాలో మందులేడు యానాల కాపులేదు ఓ మామా ||2||
కిక్కు మీద కిక్కెక్క పక్కమీద చుక్కుంది ||లబ్జనక||
[ఆమె] నోటిస్తే ముద్దిస్తా మురిపిస్తా
[అతడు] అహ వందిస్తా వేయిస్తా చెక్కిస్తా కేషిస్తా
[ఆమె] గోల్డిస్తే వాటేస్తా ఒడిఛాన్స్
[అతడు] అహ రింగిస్తా గాజిస్తా చైనిస్తా పోషిస్తా
[ఆమె] నీ ఆస్తే నాకిస్తే నాఆస్తి నీకిస్తా
[అతడు] రా కిక్కు రో ఈకేసు
[ఆమె] యహ కాకు టైలురో నా ఫేసు ||దూల్||