బావున్నారా బాగున్నారా

పల్లవి

[అతడు] బావున్నారా బాగున్నారా భామగారు బాగున్నారా హ ||2||
[ఆమె] బావున్నారా బాగున్నారా బావగారు బాగున్నారా
[అతడు] ఎదురు చూపులు చూస్తున్నారా మధన జపమే చేస్తున్నారా
[ఆమె] ఆరు అడుగుల మగధీరుడిని ఎవ్వరైనా వదిలేస్తారా
[అతడు] ఇంత బాగా సెలవిస్తారా అమ్మో చిన్నమ్మమ్మో
[ఆమె] అమ్మో అమ్మమ్మమ్మో ||బావు||

చరణం 1

[ఆమె] చిన్ని ముద్దు ఇమ్మంటారా ఛీ పోవద్దు పొమ్మంటారా
చిమ్మా అంటూ చెంతకొస్తే కొమ్మమీద కూర్చుంటారా
[అతడు] మాట మాట పెంచేసారా మంచి చెడ్డ మానేసారా
గోటితోటి పోయేదాన్ని గూటిదాకా లాగేసారా
[ఆమె] వరసలు కలిపి మరదలి ఒడికి వేంచేస్తారా మనసారా
[అతడు] బూరెల్లాంటి బుగ్గలు రెండు భోంచేస్తాలే కడుపారా
[ఆమె] ఆపై రతి మహరాజల్లే మత్తే లాగించేస్తారా ||అమ్మో|| ||బావు||


చరణం 2

[ఆమె] పిల్ల అంటూ లాలిస్తారా పెళ్లాం పోస్టు ఇప్పిస్తారా
లిల్లిపూల మంచం మీద పిల్ల నాకు పంచిస్తారా
[అతడు] వేళపాళ లేదంటారా వేళాకోళం కాదంటారా
చాటుమాటు పాటాలన్నీ నోటితోటి చెప్పిస్తారా
[ఆమె] ఆలు మగలం అయిపోదాంలే అడిగిందిచ్చెయ్ సుకుమారా
[అతడు] నోరే జారితే పర్వాలేదు కాలేజారకు యువతారా
[ఆమె] జరిగే కళ్యాణం దాకా జాగారం చెయ్యమంటారా ||అమ్మో|| ||బావు||