అమ్మతో చెప్పుకున్నా నాన్నతో చెప్పుకున్నా ఎవరితో చెప్పుకున్నా కాస్కో తడాకా

పల్లవి

[అతడు]అమ్మతో చెప్పుకున్నా నాన్నతో చెప్పుకున్నా ఎవరితో చెప్పుకున్నా కాస్కో తడాకా
[ఆమె] అన్నతో చెప్పుకున్నానే బావతో చెప్పుకున్నాగా ఎవరితో చెప్పుకున్నా చూస్కో ధమాకా
[అతడు] పైట పైపైనా అందమే పొంగుతున్నా
[ఆమె] లోన లోలోనా అలజడే అణుచుకున్నా
[అతడు] తపించే చిన్నవాడిని తెగించే పెద్దవాడిని తరించే తప్పు చెయ్యనా ...||అమ్మతో||

చరణం 1

[ఆమె] ఒకచోట అంటూనే మరుచోట చెయ్యేస్తాడే
చెయ్యేసి పొరపాటు చేసేస్తాడే
ఒకసారి అంటూనే పలుసార్లు ముద్దిస్తాడే
ప్రతిసారి పొలిమేర దాటేస్తాడే
[అతడు] పోనా సరిపోనా గోపికా రెచ్చిపోనా
[ఆమె] చాలా నచ్చానా కొద్దిగా రెచ్చిపోరా
[అతడు] నిజంగా మంచివాడిని ప్రియంగా పిచ్చివాడిని, స్ధిరంగా చిచ్చురేపనా ||అమ్మతో...||

చరణం 2

[అతడు] కూర్చున్నా నిలుచున్నా పడుకున్నా ఏం చేస్తున్నా
వాటేసి నా ప్రేమ నాటేస్తానే
గుబులైనా దిగులైనా తెగులైనా ఏ బాదైనా గురిచూసి మురపాల మందేస్తానే
[ఆమె] న్నా న్నా న్న న్న నా అంతగా వేడుకున్నా
[అతడు] అవునా అవునవునా అందుకే వేచివున్నా
[ఆమె] మరి నే చిన్నపాపని వరిస్తే పెద్దపాపని మురిస్తే పాపనివ్వనా...||అమ్మతో...||