పల్లవి
[అతడు] కవ్వించకే ఓప్రేమా కౌగిళ్లకే రావమ్మ
[ఆమె] చల్లనైన ఓప్రేమా చందమామలా రామ్మా
[అతడు] తీయనైన ఓప్రేమా తేనెవానలా రామ్మా
[ఆమె] ఎదలో ఊయలూగుమా హాయిరాగమా
వేయి కలల చిరునామా ప్రేమ
[అతడు] స్వాతి చినుకుల సందెవెలుగుల
కొత్తవరదలా రామ్మా ప్రేమ ||కవ్విం||
చరణం 1
[ఆమె] అందమైన బంధనాల వరమా
వందనాల చందనాలు గొనుమా
కలే తీరుగా ఒడే చేరుమా
[అతడు] సున్నితాల కన్నె లేతనడుమా
కన్నుతోనే నిన్ను కాస్త తడిమా
ఇదే తీరుగా ఎదే మీటుమా
[ఆమె] సాయం కావాలన్నది తాయం ఓప్రేమ
చేయందిస్తా రామరి సరదా పడదామా
నీవెంటే నీడై వుంటా నిత్యం ఓప్రేమ ||కవ్విం||
చరణం 2
[అతడు] వేడుకైన ఆడ యీడు వనమా వేడివేడి వేడుకోలు వినుమా
వయ్యారాలలో విడిది చూపుమా
[ఆమె] ఆగలేని ఆకతాయి తనమా
వేగుతున్న వేగమాప తరమా
సుతారాలతో జతై చేరుమా
[అతడు] తీరం చేరుస్తున్నది నీ నవ్వేనమ్మా
[ఆమె] భారం తీరుస్తున్నది నువ్వే లేవమ్మ
[అతడు] నాప్రాణం నీవే అంటే నమ్మాలే ప్రేమ ||కవ్విం||