గుడిగంటలు మ్రోగినవేళ మది సంబర పడుతోంది

పల్లవి
[అతడు] గుడిగంటలు మ్రోగినవేళ మది సంబర పడుతోంది
తొలి సంధ్యల వెలుగులవేళ తెగ తొందర పెడుతోంది ||గుడి||
ఆ దేవుని పూజకు నువ్వొస్తే
ఆ దేవిని చూడగ నేనొస్తే
అది ప్రేమకు శ్రీకారం ||గుడి||
శ్రీ రంగనాధ స్వామి వెంట దేవేరి తరలి వచ్చెనంట
ఆ జంట చూడముచ్చటంట వెయ్యైన కళ్ళు చాలవంట

చరణం 1

[ఆమె] నా చిరునవ్వయి నువ్వే ఉండాలి . . . ఉండాలి
[అతడు] నా కనుపాపకు రెప్పయి వుండాలి . . . ఉండాలి
చెలి గుండెలపై నిద్దుర పోవాలి . . . పోవాలి
[అమె] ఇరు మనసుల్లో ప్రేమే ఎదగాలి . . . ఎదగాలి
[అతడు] నా చెలి అందెల సవ్వడి నేనై
నా చెలి చూపుల వెన్నెల నేనై
చెలి పాదాల పారాణల్లే అంటుకు తిరగాలి
[ఆమె] నుదుటి బొట్టయి నాలో నువ్వు ఏకమవ్వాలి ||గుడి||

చరణం 2

[ఆమె] వెచ్చని ఊహకు ఊపిరి పోయాలి . . . పోయాలి
[అతడు] నెచ్చెలి పమిటికి చెంగును కావాలి . . . కావాలి
కమ్మని కలలకు రంగులు పూయాలి . . . పూయాలి
[ఆమె] నా చిరునామా నువ్వే కావాలి . . . కావాలి
[అతడు] తుమ్మెద నంటని తేనెవు నువ్వయి
కమ్మని కోకిల పాటవు నువ్వయి
చీకటిలో చిరుదివ్వెవు నువ్వయి
వెలుగులు పంచాలి
[ఆమె] వీడని నీ నీడను నేనై నిన్ను చేరాలి ||గుడి||