పల్లవి
[అతడు] అన్నయ్య అన్నయ్య కొదమసింహం నువ్వయ్యా
మా గుండెల్లో కొలువున్నావయ్యా ||2||
బ్రహ్మయ్య బ్రహ్మయ్య అన్నయ్య వచ్చాడు
అదిగో అయ్యా అందర్నింకా దీవిస్తాడయ్యా
చిరంజీవిగా వచ్చాడయ్యా మెగస్టారుగా ఎదిగాడయ్యా
స్పాన్సర్స్ ఎరుగని మనిషయ్యా మధర్ ధెరిస్సా గుణమయ్యా ||2||
అంచెలు అంచెలుగా ఎదిగిన అన్నకు ఒక్కసారిగా జై కొట్టాలయ్య
మెగస్టార్ స్టార్ స్టార్ . . .
చరణం 1
[అతడు] ఈ శీనుగాడు వేశాడా స్టెప్పు మనబాసు చూసి దీవించేటట్టు
[ఆమె] ఈ పిల్లగాడి స్టైలే హైలెట్టు మా కన్నెపిల్లలు ఐసయ్యేటట్టు
[అతడు] ఐయామ్ సోరి మీ స్పీడే ఇక్కడ తగ్గించండి ఏంటల్లరి
ఓనాఫ్యారి నీ ఊపే ఒళ్ళూపేసింది ఓ తుంటరి
నీ పెదవులు చేసి కురులను చూసికంటపడి మేం వచ్చాం ఏ పిల్లా పిల్లా పిల్లా
చుక్కల చీర కట్టింది చక్కని రైక తొడిగింది
ప్యారన్లవ్లీ పూసింది ఫారెన్ సెంటే కొట్టింది (అన్నయ్య. . .)
చరణం 2
మీమాట మాకు వేదం అన్నయ్య మీ బాటలోనే పయనిస్తాం అయ్యా
ప్రతిపనిలో మీకు తోడుంతాం అయ్యా
మీమంచి పేరు నిలబెడతామయ్యా
నిన్నే చూసి మారక్తాన్ని దానంగా ఇస్తాముగా
సాధన చేసి ఎన్నెన్నో ఫలితాలు తెస్తాముగా
మన రాష్ట్రం దాటి దేశం దాటి నీకీర్తి పెరిగిందన్నయ్య
వెలిగే సూర్యుడు మనఅన్న చల్లని చంద్రుడు ఇంద్రన్న
ఓటమినీకు లేదన్నా విజయం అంటే నువ్వన్నా (అన్నయ్య . . .)