పల్లవి
అతడు:- అందమైన పాప పేరు ఐశ్వర్య కన్ను కొట్ట నివ్వడయ్య దీనయ్యా
ఆమె:- పిటగోడ దూకి నువ్వు రావయ్యా పెద్దవాళ్ళు నిద్దరోయ్ నారయ్యా
అతడు:- తెగ ఊరించి ఊగించె అందాలయ్యా
ఆమె:- ఇక మొహమాటం ఏముంది నందామయ్యా . . . ||2||
ఆమె:- చూస్కో చూస్కో చూస్కో
అతడు:- ఏ పంబరేపేస్తాలే కాస్కో . . . ||2|| ||అందమైన||
ఆమె:- అల్లుకొని గిల్లుకొని మెత్తగనే హత్తుకొని ఈడు నచ్చింది నేడు
అతడు:- ఏ వెన్నెలని జున్నులని జుర్రుకొని తుర్రుమనే స్పీడు నాకుంది చూడు
ఆమె:- వలపు తలుపు తెరుచుకొని ముందుగనే రానా
అతడు:- చిలక పిలుపు తెలుసుకొని విందుకిలా రానా
ఆమె:- బోలో ముద్దాడుకోవా నీదే ఈ పాలకోవా
అతడు:- నాకే పుట్టించి నాకు కేకే పెట్టాలి కోకా రైకా
కాస్కో కాస్కో కాస్కో . . . ||2||
ఆమె:- వేస్కో ఏస్కో ఏస్కో . . . ||2|| ||అందమైన||
ఆమె:- ముట్టుకొని పట్టుకొని చుట్టుకొని తట్టుకొని వాని కొట్టాలి బోని
అతడు:- ఏ తప్పకని తొందరని తప్పుమరి చెయ్యమనే రాణి సరేలే కాని
ఆమె:- మళుకు బెలుకు సరుకులను సర్దుకొని రానా
అతడు:- చిలిపి తనువు సిగ్గులను ఎత్తుకొని పోనా
ఆమె:- బాజా మోగించురాజా తాజాగున్నాది రోజా
అతడు:- మోజే పుట్టాకా పూజా రోజూ చేస్తాలే ఆజా ఆజా
కాస్కో కాస్కో కాస్కో
ఆమె:- ఏ చెయ్ చెయ్ చేసేది చేస్కో ||అందమైన||