పల్లవి
హేయ్ గోంగూర తోటకాడ కాపుకాసా
హేయ్ హేయ్ కోడికూసె వేళదాక ఎదురుచూసా ||గోంగూర||
అంతలోనె కరిగిపోయె ముద్దు ఆశ
నీకు వెన్నముద్ద లిచ్చుకుంట వేంకటేశ
కోరుకున్న కోరకండ్ల నోరు ముద్దేపుడమ్మో
ఓరి పిల్లడా తలగడా మల్లెపూల జల్లెడా
నువ్వు నాకు నచ్చినావు అందగాడ
ఓసి అమ్మడు జిమ్మడు అంత నచ్చినప్పుడు
దాచమాకు ఉట్టిమీద పాలమీగడ ||గోంగూర||
చరణం 1
హేయ్ రా రమ్మనీ కన్ను కొట్టగా కొంగునే చుట్టుకొనా
నా కమ్మనీ కన్నె కౌగిలింత కానుకివ్వనా
చీ పోమ్మనీ నన్ను ఊరికే నట్టిలా వదులుతాన
నీ తియ్యని చెంపగిల్లకుండ ఉండగలనా
హే... గువ్వా గోరింకలాటకే పోదాము
దావ గుమ్మాగుమ్మాళ్ళ గూటికే
హే... చుమ్మలచమ్మాల ముద్దుకే
సందేళ రావే గున్నా మావిళ్ళతోటకే
ఓరి పిల్లడా మళ్ళుడా ఇంటికొస్తె అళ్ళుడా
కందిచేను పక్కనిన్ను కలుసుకోనా
ఓసి అమ్మడు గుమ్మడు పొద్దివాలినపుడు
పెరటిలోన చిలకపట్టి మంచమెయ్యనా ||గోంగూర||