అరెరెరె ఏ మది పరిగెడుతున్నది నా మది

పల్లవి

[అతడు] అరెరెరె ఏ మది పరిగెడుతున్నది నా మది
తెలియని హాయి ఇది అలజడి రేపుతున్నది
[ఆమె] తనువంతా పులకిస్తున్నది, చిగురంతై వణికిస్తున్నది
నేనంటే నువ్వంటున్నదీ మనస్సు ఎందుకో మరీ
[అతడు] నీలాగే నాకూ ఉన్నదీ, ఏదేదో అయిపోతున్నదీ
నా ప్రాణం నువ్వంటున్నదీ, మనస్సే ఎందుకే ప్రియా మరీ
మరీ అరెరెరె ఏ మది పరిగెడుతుంది నా మది - - -
లేతపెదవుల తీపి తడి మొదటి ముద్దుకు ఉలిక్కిపడి మేలుకున్నదీ
[ఆమె] ఎడమవైపు గుండె సడి ఎదురుగా నీ పిలుపు విని వెల్లువైనది
[అతడు] తొలి వెన్నెలంటే తెలిపిందీ నీ జతలో చెలిమి
[ఆమె] తొలి వేకువంటే తెలిసిందీ నీ చేయి తడిమి
[అతడు] & (ఆమె) అరెరె...
[అతడు] కన్నులు చూసిన తొలి వరము కలలు కోరిన కల వరము నిన్న లేదే ఇది
[ఆమె] చిలిపి సిగ్గులు పరిచయము కొంటె నవ్వుల పరిమళము నచ్చుతుంది
[అతడు] మన మధ్య వాలె చిరుగాలి నలిగిందే పాపం.
[ఆమె] పరువాల లాల చెలరేగి చిరిగిందే దూరం
[అతడు] అరెరె ...