పల్లవి
నిను కలిసిన నిముషమున నిను తెలిసిన
క్షణమున కనుల పండువాయెనే మనసు నిండిపోయెనే ||నిను||
చరణం 1
ఆశాలత మొగ్గలేసి పూలు విరగబూసెనే
ఆశాలత మొగ్గలేసి పూలు విరగబూసెనే
తలపులెల్ల వలపులై పులకరింపజేసెనే
తలపులెల్ల వలపులై పులకరింపజేసెనే
పరవశించి పోతినే ||నిను||
చరణం 2
చందమామ నేడేలనే చలినివెన్నేల కాయడే
చందమామ నేడేలనే చలినివెన్నేల కాయడే
గాలికూడా ఎందుకనో నులివెచ్చగా వీచెనే
గాలికూడా ఎందుకనో నులివెచ్చగా వీచెనే
మేను కందిపోయెనే ||నిను||