ఏకాకిగ విలపించుచుంటినా చీకాకున బడి తల్లీ!
కాపురముండవు కష్టాలేవీ కలకాలము ఓ చెల్లీ!
||ఏకాకి||
మిడిసిపడే యీ పెత్తనదారులు మెత్తని కత్తులు తల్లీ!
కలిమి బలంతో పేదల జంపి కులుకుచుందురో చెల్లీ!
||ఏకాకి||
అన్నను మించిన ఆప్తుని యెవడో హత్య చేసె గద తల్లీ!
దేవుని సన్నిధికేగిన తల్లీ తిరిగిరాదు ఓ చెల్లీ!
||ఏకాకి||
విడదీసెడు మీ గువ్వల జంటను వేటకాడు నా తల్లీ!
నిజమేదో తెలియును జగతికి నిలకడ మీదను చెల్లీ!
||ఏకాకి||