పల్లవి
బీదల రోదన వినవా
నిరుపేదల వేదన కనవా
ఓ కానని దైవమా
||బీదల||
చరణం 1
కూటసాక్ష్యములు చెప్పేవాళ్ళు
కొంపలు తీసి గడించేవాళ్ళు
జారులు చోరులు కూనీకోరులు
వీరా వూరికి పాలకులు
ఓ కానని దైవమా
||బీదల||
చరణం 2
సొమ్మిస్తేనే రక్షిస్తావా
నమ్మినదీనుల శిక్షిస్తావా
దీనుల కాచే దేవుడందురు
దేనికి నీకీ పేరో చెవుమా
ఓ కానని దైవమా
||బీదల||
చరణం 3
కానీ లేదుర ముడుపుగట్టుటకు
కన్నీటను నీ కాళ్లు కడిగెదను
అన్నెము పున్నెము ఎరుగమురా
మమ్మాదరించి కాపాడ రమ్మురా
ఓ కానని దైవమా
||బీదల||