[ఆమె] ఒన్...టూ...త్రీ...ఫోర్...
ఫైవ్...సిక్స్...సెవెన్...ఎయిట్...
మాస్టారూ డ్రిల్ మాస్టారూ
8 7 6 5 4 3 2 1
మానేస్తారా? ఇక మానేస్తారా?
ఉద్యోగం ఇస్తాము చేస్తారా? ఒక
ఉద్యోగం ఇస్తాము చేస్తారా
ఒళ్ళు పంచి పని చేయాలి
మెదడుకు పదును పెట్టాలి
[అతడు] అమ్మయ్యే! మెదడే?
[ఆమె] అది లేకున్నా పరవలేదు
మీకు తోడుగా వుంటాను
[అతడు] అమ్మయ్యా! వుంటారా?
[ఆమె] మెలుకువగా పని చేశారంటే
మీరే దొరలా వస్తారు...
[అతడు] మరి జీతం?
[ఆమె] నెలకు ముప్పై రోజులు జీతం
రోజుకు రెండే పూటలు బత్తెం
[అతడు] చిత్తం!
[ఆమె] పూటపూటకు పని వుంటుంది
నాలుగు రోజులు సెలవుంటుంది
[అతడు] సెలవుల్లో ఏం చేయాలి?
[ఆమె] మా కొలువుననే మీరుండాలి
మా కనుసన్నలలో మెలగాలి
[అతడు] దానికి జీతం?
[ఆమె] నా జీవితం!