అనాదిగా జరుగుతున్న అన్యాయం ఇదిలే!

అనాదిగా జరుగుతున్న అన్యాయం ఇదిలే!
అదేమిటో! ఆడదంటే మగవాడికి అలుసులే
||అనాదిగా||

ఎవడో ఒకడన్నాడని
అదియే ప్రజావాక్యమని
అగ్ని వంటి అర్థాంగిని అడవి కంపె రాముడు
శ్రీరాముడు
||అనాదిగా||

ధర్మం ధర్మమని జూదమాడి ఒక రాజు
ఆలి నోడినాడు సత్యం సత్యమని ఒక మగడు
సతిని అమ్మినాడు అదేమిటో ఆడదంటె మగవాడికి అలుసులే
||anaadigaa||