వెన్నెలింత వేడిగా ఎండ ఇంత చల్లగా

పల్లవి

[అతడు] వెన్నెలింత వేడిగా ఎండ ఇంత చల్లగా ఉండేలాగా
చేశావే ఓ ప్రియా
[ఆమె] చేదు ఇంత తీయగా, కారం కూడా హాయిగా
ఉంటుందని నేర్పవే ఓ ప్రియా
[అతడు] చీకట్లో సూర్యుడు, పొద్దున్నేమో జాబిల్లి వచ్చాయే
నువ్వే నవ్వంగా
[ఆమె] నేనిచ్చే మేఘాలు, నా కౌగిట్లో గోదారి చేరాయే
నువ్వే చూడగా ||వెన్నెలింత||

చరణం1

[అతడు] నాపేరే అనుకుంటూ నీపేరు నేను రాశానే
[ఆమె] నారూపే అనుకుంటూ నీరూపు నేను గీశానే
[అతడు] తీయంగా తీయంగా ఏదో ఏదో అవ్వంగా పెళ్ళంటూ
కానే కాదంట
[ఆమె] గిచ్చంగా కొత్తంగా ప్రేమను మింటే పొదరింట్లో మన
జంటే కనిపెట్టాలంట ||వెన్నెలింత||

చరణం2

[అతడు] గాలైనా నిను చుడితే ఎనలేని ఈర్ష్య కలిగింది
[ఆమె] నేనేమో నిను తిడితే ఎదలో అసూయ కలిగింది
[అతడు] గారంగాగర్వంగా జొడి మనమే కట్టంగా ఏడే జన్మలు
సరిపోవంట
[ఆమె] దేవుళ్ళే మనకోసం పగలు రేయి పనిచేసి ఎన్నో జన్మలు
సృష్టించాలంటు ||వెన్నెలింత||