నీ కళ్ళతోటి

పల్లవి

[అతడు] నీ కళ్ళతోటి నా కళ్ళలోకి చూస్తేనే చంద్రోదయం
నీ చూపుతోటి నను తాకుతుంటే కనుదైక
సూర్యోదయం
[అతడు] ఇలాగే ఇలాగే మనం ఏకమయ్యే క్షణాలే కదా ఓవరం
[ఆమె] అలాగే అలాగే ప్రపంచాలు పలికే పదమవ్వాలి
మనమిద్దరం ||నీ కళ్ళతోటి||

చరణం 1

[ఆమె] ఓ...అడగనా ప్రేమే నీ వెంటేనేను తోడుగా నడవగా
చివరిదాకా
[అతడు] నీ గొడుగవుతాను ఇకపైన నేను బావిలో వెన్నెల
తడవనీగా
[ఆమె] నిన్నొదిలి క్షణమైనా అసలుండలేను చిరునామానా
నాపైన పెదవుంచనా
[అతడు] నీ లేత చెక్కిళ్ళ వాకిళ్ళలోన తొలి సిగ్గు నేనవ్వగా ఓ ||నీ కళ్ళతోటి||

చరణం 2

[అతడు] ఆ వెన్నెలవుతాను ప్రతి రేయి నేను చేతిలో నీ దరికి చేరకుండా
[ఆమె] ఊపిరవుతాను నీ లోన నేను ఎన్నడూ నీ జతే
వదలకుండా
[అతడు] నా రాణి పాదాలు ముద్దాడుకుంటూ నేనుండి
పోతాను పారాణిలా
[ఆమె] చిరు చెమట పడుతుంటే నీ నుదుట నేను వస్తాను
చిరు గాలిలా ||నీ కళ్ళలోటి||