పల్లవి
[ఆమె] తడవ తడవకో సారి ఈ గొడవలేల నాతో
[అతడు] తడవ సంకలో చేరి దాచింది సొగసు నెంతో
[ఆమె] ఆ వెన్నెల కన్నుల రాణి నేనంటూ లాగకు వోణి
[అతడు] ఓ వన్నెల కిన్నెరసాని నీ జున్నుల కన్నెరసాన్ని
తాపవా తాపవా అది చూపవా చూపవా
[ఆమె] తపనా తపనా ప్రేమ చూపనా ||తడవ తడవకోసారి||
చరణం 1
[అతడు] పిట్టలు కొడుతూ గట్టున నేనూ కూకున్నపుడే చూసాను
నీ పిట్ట నడుములో మడతనేనెట్టు మరవనే వనిత
[ఆమె] లొట్టలు వేస్తూ చూడకు నన్ను గుట్టుగ పెరిగా నోయ్ నేను
నే పట్టు పరికిణి కడతా నను పట్టుకోకురో తిడతా
[అతడు] రెల్లుపూల తోటల్లోన ఇల్లుమనకై కడతా
కల్లబొల్లి మాటలు కావు కళ్ళలోగ పెడతా
నమ్మవానమ్మవా అది నమ్మవా నమ్మవా
[ఆమె] నమ్మనా నమ్మనా నన్ను పొమ్మనా రమ్మనా ||తడవతడవకోసారి||
చరణం 2
[అతడు] మెట్టెలు పెడుతూ జట్టుగ మారె ఆశుభకార్యం జరిగాక
ఓ మెట్టుపైకి అడుగెడతా నా పట్టు పదును చూపెడతా
[ఆమె] బుట్టను వెతికి పువ్వును దాచి పుట్టెడు బుద్దులు నీకేల
నువు బెట్టు చేస్తె బుసకొడతా రసపట్టులోన నసపెడతా
[అతడు] చెరుకు గెడలా మాటున నీతో సరసమే మొదలెడతా
చురుకు నీలో కలుగుతు ఉన్న ఉరక వేయకు బుడతా
చెప్పవ చెప్పవ అది నువ్వవా నువ్వవా
[ఆమె] చెప్పనా చెప్పనా పెదవి విప్పనా విప్పనా ||తడవ తడవకోసారి||