ఎదలో ఏవో

పల్లవి

[అతడు] ఎదలో ఏవో వ్యధలే ఉన్న పెదవే చిందే నవ్వులవాన
చెలిమికోరుతు మనవి చాటుతూ నిలబడేమిలా తమరిముంగిట
మీ కొండంత అండింక వెన్నెంతె మాకంటె కళకుతుళుకులవుతాం....
[కోరస్] ఒసాయో సైరోరే ఒసాయో సైరోరే ఒసాయో సైరొరో
ఒసాయో సైరోరే సైరొ సైరారో... ||ఎదలో ఏవో ||

చరణం 1

[అతడు] నీ తోటిసాహసం మాకిచ్చె ఉత్సాహం కావాలి ప్రతి నిత్యం మీరిచ్చెప్రోత్సాహం
మీ గుండెల్లో చోటుంటే మాపైనే జాలుంటే
మాలోన ఒకరంటూ మీరంతా అనుకుంటే
శతకోటి దండాలిలా తలవంచి తెలిపేమిలా
వరమిస్తె మీరే ఇలా ఓ వెన్నెల్లె మాకన్నుల ||ఎదలో ఏవో||

చరణం 2

[అతడు] బొమ్మలాగ మేమూ ఆడి చూపమా బుల్లిమనసులే మేందోచుకోమ
ఈ చిన్నదాని కాలి అందె తాళమెయ్యగా
అ చిన్నవాడి చిట్టి నడుము వంతపాడగా
పసి మొగ్గల్లో ఏందాగుందో ఎవరెట్ట పసిగట్టేది
దాగున్న తపనైన వెలికొస్తేగా వెలుగిచ్చేది
[కోరస్] ఇస్తేను అవకాశము దించై మా ఆకాశమూ కళకోసమే జీవితం
ఒ ఒ ఓ కళకేలె మేమంకితం ||చెలిమికోరుతు ||