ఆ... ఆ... ఆ...
జగమే మారినది మధురముగా ఈ వేళ ||2||
కలలూ కోరికలూ తీరినవి మనసారా ||జగమే||
చరణం 1
మనసాడెనే మయూరమై పావురములు పాడే
ఎల పావురములు పాడే ||2||
ఇది చేరెను గోరువంక రామచిలుక చెంత
అవి అందాల జంట ||2||
నెనరూ కురిమి ఈనాడే పండెను ||2||
జీవితమంతా చిత్రమైన పులకింత ||జగమే||
చరణం 2
విరజాజులా సువాసన స్వాగతములు పలుక
సుస్వాగతములు పలుక
తిరుగాడెను తేనెటీగ తీయదనము కోరి
అనురాగాల తేలి
కమ్మని భావమే చిందెనే ||2||
ప్రియమగు చెలిమి సాటిలేని కలిమి ||జగమే||