తలకెక్కిరో మామ

పల్లవి

[అతడు] తలకెక్కిరో మామ కిక్కు తలకెక్కిరో
నడుమూగెరో మామ అయ్యో నడుమూగెరో ||2||
తంజావూరు గుమ్మకి మల్లె ఒళ్ళే తిరిగెనురా
తలకిందులా బొంగరమై లోకం ఆడెనురా ||తలకెక్కిరో ...||

చరణం 1

కళ్ళే కలుపు కళ్ళే కలుపు దిమ్మ తిరిగేలా దుమ్మే దులుపు
చిన్నవాడా ఏ చిన్నవాడా
కాలే లేదని కలతే వద్దు చేతులు ఉన్నా పట్టే ఉడుము
చిన్నవాడా ఏ చిన్నవాడా
బ్యాక్‌గ్రౌండ్ ఎందుకు మనకు అహ దేవుడు వినడా పిలుపు పిలుపు పిలుపు
అబ్బసొత్తు ఎందుకు మనకు అరె సత్తా ఉన్నావాడిదే గెలుపు
అరె సైడుకు పోవద్దు తలనే వంచొద్దు రారా నీలో బలముందిరా ||తలకెక్కిరో...||

చరణం 2

దేవుడు ఇతనికి అన్నీ ఇస్తే దేవుడుమీదే కంప్లైట్ ఇస్తాడు
పెద్ద బచ్చా అరె ఈ బచ్చా
పైసా మీదా ప్రేమే పెరిగి పెంచిన తల్లినే వీధిలో విడిచెను
ఆబబ్బా ఆ పెద్దబచ్చా
నీకు వయసుంది బాబు నీ బిడ్డే తంటాడు బాబు బాబు
మూన్నాళ్ళ ముచ్చట స్వామి నీకు దిల్ ఉంటే బెట్టుకట్టుస్వామి
ఏ చిల్డప్ వద్దు ఫోజు వద్దు మొండి వాళ్ళకి మొండిని నేనప్పా ||తలకెక్కిరో ...||