పల్లవి
ప్రేమంటే ఏమిటంటే నిను ప్రేమించినాక తెలిసే
మనసంటే ఏమిటంటే అది నీకివ్వగానె తెలిసే ||ప్రే||
ఇదివరకు తెలియంది ఈ అనుభవం
యదమేలు కొలిపింది ఈ పరిచయం ||ప్రేమంటే||
చరణం 1
నీకళ్ళవాకిళ్ళల్లో తలుపు తెలిచెను ప్రేమా ప్రేమా
మోహాల ముంగుళ్ళల్లో వలపు కురిసెను ప్రేమా ప్రేమా
ఈనాడే తెలిసింది తొలిసారిగా ఎంత తియ్యంది ప్రేమనీ
ఆకాశ దీపాలు ఇలచేరగ తెరతీసింది ఆమని
ఇది సంగీతమో తొలి సంకేతమో
ఇది ప్రియగీతమో మధు జలపాతమో ||ప్రేమంటే||
చరణం 2
ఈనాడు ఏదేవతో మనను కలిపిన వేళ వేళా
ఈనాడు ఈ దేవితో మనసు తెలిపెను చాలా చాలా
కాలాలు ఒకసారి ఆగాలిలే మన తొలి ప్రేమ సాక్షిగా
లోకాలు మన వెంట సాగాలిలే మన ప్రేమికుల తోడుగా
ఇది ఆలాపనో మది ఆరాధనో
మన సరసాలకే తొలి సంకీర్తనో ||ప్రేమ||