పల్లవి
[అతడు] వాన వల్లప్పా వల్లప్పా ఒళ్ళప్పగించే సామిరంగా కో ||సామిరంగా||
[ఆమె] ఆపు నీ గొప్పలే తప్ప నా తిప్పలెట్టా రంగ రంగా కో ||సామిరంగా||
[అతడు] ప్రేమరాగం తమ తాళం జంట కచ్చేరి చేస్తుంటే
[ఆమె] మంచయోగం మాయరోగం అంట గట్టేసి పోతుంటే ||వాన వల్లప్పా||
చరణం 1
[అతడు] ఆషాడమాసంలో నీటి అందాల ముసురుల్లో
[ఆమె] మేఘాల సీజన్లో కొత్త బంధాల మెరుపుల్లో
[అతడు] ఆడబిడ్డా పుట్టినింటా ఈడు కుంపట్లు రాజేసే
[ఆమె] జారిపడ్డా జారుపడ్డా నీ కౌగిట్లో దాచేసేయ్
[అతడు] తారా రారా రారా ||2|| ||వాన వల్లప్పా||
చరణం 2
[ఆమె] వేసంగి వానల్లో నను వేధించు వయసుల్లో
[అతడు] పూలంగి గొడుగుల్లో నిను బంధించు ఒడుపుల్లో
[ఆమె] అమ్మదొంగ సుబ్బరంగా మొగ్గ అంటించు మోహంగా
[అతడు] అబ్బరంగా నిబ్బరంగా అగ్గిపుట్టింది వాటంగా
[ఆమె] తూరు రురు తూరు రురు తూరు రురు ||వాన వల్లప్పా||